రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 365కు చేరింది. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు జరిపిన పరీక్షల్లో మరో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులు అనంతపురం జిల్లాలో నిర్థారణ అయినట్లు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 892 కొవిడ్ -19 పరీక్షలు చేయగా..అందులో 17 కేసులు పాజిటివ్‌గా నమోదైనట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 349గా తెలిపింది.
ఇదీ చదవండి: